Saturday, March 7, 2026

త్వరలో కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన!

హైదరాబాద్ , నిఘా న్యూస్: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా, పర్యాటక రంగాలను కొత్త దశకు తీసుకెళ్లే భారీ ప్రాజెక్టుగా భావిస్తున్న కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమ శిలను, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరును కలుపుతూ నిర్మించబోయే ఈ అత్యా ధునిక వంతెనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ అనుమతుల విషయంలో కూడా ముఖ్యమైన పురో గతి నమోదైంది. నేషనల్ హైవే-167కే విస్తరణ కోసం అవసరమైన అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ స్టేజ్-1 అనుమతులను మంజూరు చేసింది. దీంతో ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం దిశగా ప్రక్రియ వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశంలోనే తొలి కేబుల్ స్టేడ్-కమ్-సస్పెన్షన్ బ్రిడ్జి రూ.1000 కో­ట్ల అం­చ­నా వ్య­యం­తో ని­ర్మిం­చ­ను­న్న ఈ వం­తెన ప్ర­త్యే­కత ఏమి­టం­టే ఇది దే­శం­లో­నే మొ­ద­టి కే­బు­ల్ స్టే­డ్-కమ్-సస్పె­న్ష­న్ బ్రి­డ్జి­గా ని­ల­వ­నుం­ది. ఆధు­నిక ఇం­జి­నీ­రిం­గ్ సాం­కే­తి­క­త­ను ఉప­యో­గిం­చి ని­ర్మిం­చ­బో­యే ఈ వం­తెన ని­ర్మా­ణం పూ­ర్త­యి­తే అది కే­వ­లం రవా­ణా మా­ర్గ­మే కా­కుం­డా ఒక పర్యా­టక ఆక­ర్ష­ణ­గా కూడా మారే అవ­కా­శ­ముం­ది.

ప్ర­పం­చం­లో­ని ప్ర­ముఖ నగ­రా­ల్లో కని­పిం­చే ఐకా­ని­క్ బ్రి­డ్జిల మా­ది­రి­గా దీ­న్ని రూ­పొం­దిం­చే­లా ప్ర­ణా­ళి­ క­లు సి­ద్ధం చే­స్తు­న్న­ట్లు సమా­చా­రం. అటవీ అనుమతులకు కీలక సమావేశం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ అనుమతులపై చెన్నైలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో జరిగిన ఈ సమావేశంలో స్టేజ్-1 అటవీ అనుమ తులను కొన్ని షరతులతో మంజూరు చేశారు.

అటవీ భూమిని రహదారి విస్తరణ కోసం ఉపయోగిం చాల్సి ఉండటంతో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు నిబంధనలు విధించారు. అటవీ శాఖ అధి­ప­తి డా­క్ట­ర్ సి. సు­వ­ర్ణ మా­ట్లా­డు­తూ అటవీ భూమి వి­ని­యో­గం వల్ల పర్యా­వ­ర­ణా­ని­కి నష్టం కల­గ­కుం­డా చర్య­లు తీ­సు­ కో­వా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. ము­ఖ్యం­గా అక్కడ సం­చ­రిం­చే వన్య­ప్రా­ణుల సం­ర­క్ష­ణ­కు ప్ర­త్యేక ప్ర­ణా­ళి­ క­లు రూ­పొం­దిం­చా­ల­ని సూ­చిం­చా­రు.

అడ­వి­లో­ని జీ­వ­వ్య­వ­స్థ­ను కా­పా­డే వి­ధం­గా ని­ర్మాణ పను­లు చే­ప­ట్టా­ల­ని చె­ప్పా­రు. అటవీ భూ­మి­ని రహ­దా­రి ని­ర్మా­ణా­ని­కి వి­ని­యో­గి­స్తు­న్నం­దున మరో ప్రాం­తం­లో మొ­క్క­లు నాటి కొ­త్త అటవీ ప్రాం­తా­ న్ని అభి­వృ­ద్ధి చే­యా­ల­ని కూడా కేం­ద్రం సూ­చిం­చిం­ది. దీ­ని­ని కం­పె­న్సే­ట­రీ అఫా­రె­స్టే­ష­ న్”గా పి­లు­స్తా­రు. అలా­గే అటవీ భూమి మళ్లిం­పు­కు సం­బం­ధిం­చిన నెట్ ప్రె­జెం­ట్ వా­ల్యూ రూ­పం­ లో ప్ర­భు­త్వా­ని­కి ని­ధు­లు చె­ల్లిం­చా­ల­ని కూడా పే­ర్కొ­న్నా­రు.

ఈ ని­ధు­ల­ను అటవీ అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­కు వి­ని­యో­గి­స్తా­రు. పర్యా­వ­రణ పరి­ర­క్ష­ణ­కు సం­బం­ధిం­చిన అన్ని ని­బం­ధ­న­లు కచ్చి­తం­గా పా­టిం­చా­ల­ని కేం­ద్రం స్ప­ష్టం చే­సిం­ది. ఈ షర­తు­ల­ను పూ­ర్తి­గా అమలు చే­స్తే స్టే­జ్-2 అటవీ అను­మ­తు­లు మం­జూ­రు అవు­తా­య­ని అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. ఈ ప్ర­క్రి­య­లో ఏజె­న్సీ­తో పాటు అన్ని శా­ఖ­ల­ను సమ­న్వ­యం చే­సి­న­ట్లు డా­క్ట­ర్ సు­వ­ర్ణ తె­లి­పా­రు. ప్రయాణికులకు భారీ లాభం ఈ వం­తెన ని­ర్మా­ణం పూ­ర్త­యి­తే తె­లం­గాణ మరి­యు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ మధ్య రవా­ణా వ్య­వ­స్థ­లో పె­ద్ద మా­ర్పు వస్తుం­ది.

ము­ఖ్యం­గా హై­ద­రా­బా­ద్ నుం­చి తి­రు­ప­తి వె­ళ్లే ప్ర­యా­ణి­కు­ల­కు దూరం సు­మా­రు 80 కి­లో­మీ­ట­ర్ల వరకు తగ్గే అవ­కా­శం ఉంది. ప్ర­స్తు­తం ఈ రెం­డు ప్రాం­తాల మధ్య ప్ర­యా­ణం చే­యా­లం­టే చాలా పొ­డ­వైన మా­ర్గా­న్ని ఉప­యో­గిం­చా­ల్సి వస్తోం­ది. కొ­త్త వం­తెన వల్ల ప్ర­యాణ సమయం కూడా గణ­నీ­యం­గా తగ్గ­నుం­ది. ఇది కే­వ­లం ప్ర­యాణ సౌ­ల­భ్యా­న్ని పెం­చ­డ­మే కా­కుం­డా రా­య­ల­సీమ, తె­లం­గాణ ప్రాం­తాల మధ్య ఆర్థిక మరి­యు సా­మా­జిక అను­సం­ధా­ నా­న్ని కూడా బలో­పే­తం చే­య­నుం­ది.

పర్యాటక రంగానికి ఊతం ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పర్యాటక రంగానికి భారీ ప్రోత్సాహం లభించనుంది. నల్లమల అడవులు, శ్రీశైలం బ్యాక్‌వాటర్స్, సోమశిల సిద్ధేశ్వర ఆలయం వంటి ప్రాంతాలు ఇప్పటికే ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి. కొత్త వంతెనతో ఈ ప్రాంతాలకు పర్యాట కుల రాకపోకలు మరింత పెరిగే అవకాశముంది.

ప్రత్యేకంగా వంతెనపై ఏర్పాటు చేసే వ్యూ పాయింట్లు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కృష్ణా నది మధ్యలో విస్తరించిన నీటి విస్తీర్ణం, చుట్టూ నల్ల మల అడవుల అందాలు ఈ వ్యూ పాయింట్ల నుంచి చూడగలిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular