హైదరాబాద్, నిఘా న్యూస్:రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మధురానగర్ స్ట్రీట్ నెంబర్ మూడులో యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళన కు గురిచేస్తుంది,
మధురానగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి యువకుడి ని గుర్తు తెలియని దుండ గులు అతి కిరాతకంగా గొంతు కోసి దారుణంగా హతమార్చారు. నడిరోడ్డుపై జన సంచారం ఉన్న చోటనే చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి వివరాలు తెలిస్తే నిందితులు దొరికే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తు న్నామని ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


