చొప్పదండి, నిఘా న్యూస్: చొప్పదండి మండలంలోని ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షునిగా జక్కుల అనిల్ కుమార్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ఉప సర్పంచ్‌లు సమావేశమై, ఫోరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రామీణ పాలనను మరింత బలోపేతం చేయడం, ఉప సర్పంచ్‌ల సమస్యలను సమిష్టిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఆయనను అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జక్కుల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్‌లను ఏకం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉప సర్పంచ్‌లు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీనివాస్, గజ్జల తిరుపతి, ఎముండ్ల చంద్రశేఖర్, కూకట్ల జలజ రాజేశం, మారం సమత రాజేష్, మునిగాల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా జక్కుల అనిల్ కుమార్ యాదవ్
RELATED ARTICLES


