వేములవాడ, డిసెంబర్ 10, నిఘా న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న శివుని విగ్రహం సరైన శుభ్రత లేకుండా ఉండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కులు చెల్లించేందుకు అక్కడికి వచ్చే భక్తులు, విగ్రహం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కనీసం వారానికి ఒకసారి అయినా ఆలయ సిబ్బంది శివుని విగ్రహం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని భక్తులు కోరుతున్నారు. ఇది భక్తుల భావోద్వేగాలకు సంబంధించిన అంశం కావడంతో ఆలయ అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పవిత్రమైన ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని భక్తుల డిమాండ్. చేస్తున్నారు
వేములవాడ ఆలయం వెనుక భాగంలో ఉన్న శివుని విగ్రహం నిర్వహణపై భక్తుల ఆవేదన
RELATED ARTICLES


