వేములవాడ కోర్టు సమస్యలపై విన్నపం
వేములవాడ, నిఘా న్యూస్: రెండు నెలలు సెలవుపై అమెరికా వెళ్లి తిరిగి వచ్చి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన పి. నీరజను వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో కార్యవర్గం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, రాజన్న లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడ కోర్టుకు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు అధ్యక్షులు సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కటకం జనార్ధన్, నాగుల సంపత్ కుమార్, గుజ్జే మనోహర్, కనికరపు శ్రీనివాస్ గంప మహేష్, కనపర్తి రాజశేఖర్, గుడిపెల్లి మహేష్, లేడీ రిప్రజెంటివ్ జక్కుల పద్మ ఉన్నారు.


