Thursday, December 25, 2025

నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

కరీంనగర్, నిఘా న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా, పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని మెటీరియల్స్ సిద్ధంగా ఉండాలన్నారు. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న ,రెండవ విడత పోలింగ్ డిసెంబర్ 14 న, మూడో విడత పోలింగ్ డిసెంబర్ 17న జరగనున్న దృష్ట్యా పిఓ ,ఏపిఓలకు, సూక్ష్మ పరిశీలకులకు మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నోడల్ అధికారులు అవసరమైతే వారి కార్యాలయం నుండి లేదా ఇతర సిబ్బందిని సహాయకులుగా నియమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం గురించి చర్చించారు.
ఎక్కడా అలసత్వానికి తావివ్వవద్దని, ఎన్నికల పట్ల ఎవరైనానిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నియమాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. నోడల్ అధికారులు మరోసారి ఎన్నికల నియమ, నిబంధనలను క్షుణ్ణంగా సరిచూసుకొని పొరపాట్లు దొర్లకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.సమావేశంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular