ఇది పదవి కాదు.. అప్పుల ఊబి..!
ఖద్దర్ చొక్కా వెనుక.. కన్నీటి గాథ
కరీంనగర్, నిఘా న్యూస్: గ్రామపంచాయతి ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్ని కలు మామూలు పోటీలు కావు. ఇది కేవలం అధికార పదవి కాదుమొత్తం గ్రామాన్ని నడిపించే బాధ్యత, అందుకే సర్పంచ్ బరిలోకి దిగేవారు ముందే జాగ్రత్తగా ఆలోచించాలి. గెలవడం ఒక్కటే లక్ష్యమైతే తర్వాత ఎదురయ్యే ఒత్తిడులు, అభివృద్ధి కష్టాలు భరించడం కష్టం. గతంలో ఎన్నో గ్రామాల్లో సర్పంచులు తను సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి రోడ్లు వేశారు. లైట్లు పెట్టించారు, కాలు వలు, భవనాలు నిర్మించారు. బిల్లులు రాక అప్పులు పేరుకుపోయి ఇబ్బందులు పడిన సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో సర్పంచ్ సుమారు 10 నుంచి 20 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసిన ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ అప్పుల భారం భరిం చలేక, ఆత్మహత్యకు దిగిన ఘటనలు కూడా | నమోదయ్యాయి. ఈ పరిణామాలు సర్పంచ్ బాధ్యతల భారాన్ని, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న జాప్యాన్ని అద్దం పడుతున్నాయి.
సర్పంచ్ అభ్యర్థులు గెలవడం కోసం ఓటర్లకు డబ్బులు, మద్యం, కానుకలు పంచే అలవాటుకు రాజకీయ నాయకులే బీజం వేశారు, దీనివల్ల నిజాయితీ, విలువలు ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో నిలబడలేకపోతున్నారు. సర్పంచ్ బరిలో నిలిచే ప్రతి ఒక్కరూ ఈ విష వలయం నుంచి బయటపడాలని, నూతన శకనానికి నాంది పలకాలని సామాజిక వేత్తలు పిలుపుని స్తున్నారు. ప్రజల అభిమానాన్ని గెలుచుకుని, అందరినీ సమాన త్వంతో చూస్తానని, అందుబాటులో ఉంటానని భరోసా ఇవ్వాలి. ప్రస్తుత ఈ ఎన్నికల విధానంలో ఈ మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది.
ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో తను ఓటు హక్కు విలువను గుర్తించాలి. నోటుకు, మందు బాటిళ్లకు, బిర్యానీలకు మీ ఓట్లను అమ్ముకుంటే, ప్రశ్నించే హక్కును మీరే కోల్పోతారని ప్రజలు గ్రహించాలి. డబ్బులు తీసు కోకుండా ఓటు వేస్తే… గ్రామంలో ఏదైనా సమస్య వస్తే, ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేస్తలేవని గట్టిగా నిల దీసే హక్కు మీకు ఉంటుంది. ప్రజలు డబ్బులు తీసు కోము అని ప్రతిజ్ఞ పూని, డబ్బులివ్వని మంచి వ్యక్తులను ఎన్నుకుంటేనే గ్రామంలో నిజమైన మార్పు సాధ్యమవుతుంది.
ఎన్ని చట్టాలు వచ్చినా, గ్రామాల్లో ఇంకా పెత్తందారీ కులాలదే రాజ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు సర్పంచ్ లు అయితే, తెర వెనుక నుండి పెత్తందారులు నడిపిస్తున్నారు. ఇక మహి ళలు సర్పంచ్లు అయితే వారి భర్తలే అధికారం చెలాయిస్తున్నారు. నామమాత్రపు సర్పంచ్లతో గ్రామ స్వరాజ్యం కల ఎలా సాకారమవుతుంది?
ఈ సారి గ్రామాల్లోని యువతీ, యువకులు, మహిళలు అందరూ ఆలో చించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మన అభ్యర్థి.. విలువలు ఉన్న వాడా.. చదువుకున్నావాడా..? అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్నదా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. గ్రామాల్లో మంచి నాయకులు ఎదిగితేనే జిల్లా, రాష్ట్ర, దేశానికి మంచి నాయకులు వస్తారు.


