Friday, February 27, 2026

‘జూబ్లిహిల్స్ ’ గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ అంచనా కాంగ్రెస్ కే పట్టం?

హైదరాబాద్, నిఘా న్యూస్: హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజేతలు ఎవరో రేపు తేలిపోనుంది, శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్ గూడ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు మొదలు అవుతుంది, ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది….

ఓట్ల లెక్కింపు కోసం 42 టేబుల్ లను ఏర్పాటు చేశారు.అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. రేపు ఉదయం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు.

407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని వెల్లడించారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్వో కర్ణన్ తెలియజేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.

ఫలితాలను ఎప్పటి కప్పుడు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తా మని, మీడియాకు ప్రత్యేకం గా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామని అన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి ఉన్న వారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేక సంస్థల అంచనాల ప్రకారం..అధికార కాంగ్రెస్ పార్టీకే విజయం సాధిస్తాయని పేర్కొన్నాయి. 47 శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ గెలుపు సాధ్యమని అంచనా వేశాయి. బీఆర్ఎస్‌కు కొన్ని సంస్థలు 41 శాతం ఓటింగ్ పడినట్లు తెలిపాయి. తుది ఫలితం ఈ నెల 14వ తేదీన తెలుస్తుంది.

HMR సర్వే: కాంగ్రెస్‌కు 48.3 శాతం, బీఆర్ఎస్‌కు 43.18శాతం, బీజేపీకి 5.84 శాతం ఓట్లు లభించే అవకాశముందని పేర్కొంది
సాయంత్రం 6 గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ వైపే ఓటర్లు

పబ్లిక్‌ పల్స్‌:
కాంగ్రెస్‌ 48.5%, BRS 41.8%, BJP 6.5% ఓట్లు

చాణక్య స్ట్రాటజీస్‌:
కాంగ్రెస్‌ 46%, BRS 43%, BJP 6% ఓట్లు

నాగన్న సర్వే:
కాంగ్రెస్‌ 47%, BRS 41%, BJP 8% ఓట్లు

ఆపరేషన్‌ చాణక్య:
8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే

JANMINE సర్వే:
కాంగ్రెస్‌ 42.5%, BRS 41.5%, BJP 11.5% ఓట్లు

HMR సర్వే:
కాంగ్రెస్‌ 48.31%, BRS 43.18%, BJP 5.84% ఓట్లు

స్మార్ట్‌పోల్‌:
కాంగ్రెస్‌ 48.2%, BRS 42.1%, BJP 7.6% ఓట్లు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular