హైదరాబాద్, నిఘా న్యూస్: సినీనటుడు రాజీవ్ కనకాలకు హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్ పేట్, మున్సిపాలిటీ పసుమ మూలలో తనకు సంబంధించిన వివాదాస్పద ప్లాటును నీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి గతంలో విక్రయించాడు అయితే లేని ప్లాంటును ఉన్నట్లు చూపి తనను మోసం చేశారని బాధితుడు ఆరోపించారు.
పూర్తి వివరాలలోకి వెళితే … హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 421 వెంచర్‌లో రాజీవ్ కనకాలకు ఓ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను ఆయన కొన్ని నెలల క్రితం విజయ్ చౌదరికి విక్రయించారు. అధికారిక రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
అయితే, విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను ఎల్బీనగర్‌కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించారు. కానీ, ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. ఇటీవల శ్రవణ్ రెడ్డి తన ఫ్లాట్‌ను పరిశీ లించేందుకు వెళ్లినప్పుడు, సదరు ప్లాట్ ఎక్కడా కనిపించకపోవడం, ఆ స్థలంలో ఆనవాళ్లు లేకపోవడం గమనించారు. తనను నకిలీ స్థలంతో మోసగించారన్న అనుమానంతో విజయ్ చౌదరిని సంప్రదించారు.
అయితే, దీనిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందా మని చెప్పి తప్పించుకున్నా డని,సమాచారం. గట్టిగా అడిగితే అంతు చూస్తానని బెదిరించినట్లు శ్రవణ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముందుగా స్థలాన్ని విక్ర యించిన రాజీవ్ కనకాల పాత్రను పరిశీలించేందుకు ఆయనకు నోటీసులు జారీ చేశారు.