హైదరాబాద్, నిఘా న్యూస్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడున్న నేపథ్యంలో జడ్పీపి, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వము బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది,
మేడ్చల్,మల్కాజ్గిరి,అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ జడ్పిపి,ల జాబితా నుంచి దానిని తొలగించా రు. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది, రాష్ట్రంలో జడ్పీలు 31, ఎంపీపీలు 556, జడ్పిటి సిలు 566, ఎంపీటీసీలు
స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12, 778, వార్డులు 1, లక్ష 12 వేల 696 ఉన్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.