హైదరాబాద్ , నిఘా న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోట శ్రీనివాస రావు, మృతి చెందిన బాధ మరువక ముందే, అలనాటి నటి బి.సరోజాదేవి,ఈరోజు ఉదయం కన్ను మూశారు. ఆమె వయసు 87 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
బి.సరోజా దేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఎన్నో చిరస్మర ణీయ పాత్రలు పోషించారు. ఆమె మృతితో సినీ వర్గాలు, అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు. ఒక్కరోజు తేడాలో ఇద్దరు గొప్ప నటుల్ని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటుగా భావిస్తున్నారు.
కొన్ని వందల చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో దిగ్భ్రాంతి చెందిన సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. కోట మరణించి 24 గంటలు గడవకముందే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. అలనాటి నటి బి.సరోజా దేవి సోమవారం కన్నుమూశారు.
ఆమె వయసు 87 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడు తోన్న ఆమె బెంగళూరు యశ్వంత్‌పురలోని మణి పాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బి.సరోజా దేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఎన్నో అద్బుతమైన పాత్రలు పోషించారు. ఆమె మృతి తో సినీ వర్గాలు, అభిమా నులు శోకసంద్రంలో మునిగిపోయారు.
1938 జనవరి 7వ తేదీన బెంగళూరులో జన్మించిన బి.సరోజా దేవికి 13 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ఛాన్స్ రాగా దాన్ని వదులు కున్నారు. ఆ తర్వాత 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన కన్నడ మూవీ ‘మహాకవి కాళిదాసు’తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నారు. రెండేళ్ల తర్వాత ‘1957’లో ‘పాండురంగ మహాత్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. సుమారు 180 చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఎన్నో సూపర్‌హిట్లు అందుకున్నారు.
తెలుగులో పాండురంగ మహత్యం, భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మ బలం, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, శకుంతల, రహస్యం, భాగ్యచక్రం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం తో పాటు……
శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించారు. కర్ణాటకకు చెందిన బి.సరోజా దేవి తెలుగులో మంచి చిత్రాలు చేసినా తమిళ ప్రేక్షకులు ఆమెను నెత్తిన పెట్టుకున్నా రు. ఆ కాలంలో తమిళ స్టార్ హీరోలందరితోనూ నటించారామె. ఎంజీఆర్‌తో ఏకంగా 26 సినిమాల్లో నటించి బి.సరోజ.. శివాజీ గణేషన్‌తో 22 చిత్రాలు, జెమినీ గణేషన్‌తో 17 సినిమాల్లో నటించడం విశేషం.