Sunday, August 3, 2025

త్వరలో సహాయక సంఘాల మహిళలకు రెండేసి చీరలు

హైదరాబాద్, నిఘాన్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వ యం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతి సభ్యురాలికి రెండు చొప్పున మొత్తం 1.30 కోట్ల చీరలను పంపిణీ చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు 4 కోట్ల మీటర్ల చీరలు అవసరమవుతా యని అధికారులు అంచనా వేశారు. ఈ చీరల తయారీ ప్రస్తుతం సిరిసిల్లలోని పవర్‌ లూమ్‌లపై ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన వాటి ఉత్పత్తి కూడా వేగంగా కొనసాగుతోందని సమాచారం.

సిరిసిల్లలో రోజుకు సుమారు 5 వేల మంది పవర్‌లూమ్ కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.ప్రభుత్వం ఈ చీరల తయారీని సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ పథకం కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే రూ. 318 కోట్లను విడుదల చేసింది. చీరల డిజైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఖరారు చేశారు. ఈసారి దసరాకు లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సిరిసిల్ల జిల్లా లో సాంచాల సవ్వడి మొద లైంది. గత నెల రోజులుగా పనులు అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. దీని ద్వారా ఒక్కో కార్మికుడు వారానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకూ సంపాది స్తున్నారని అధికారులు తెలిపారు.

తమకు ఉపాధి సమస్య తీరిందని కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు ఒక చీర మాత్రమే అందించ గా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం మహిళా సభ్యుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తుండగా.. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular