Sunday, August 3, 2025

31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్

హైదరాబాద్, నిఘా న్యూస్: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వ హించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు..

ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవో సి సెంట ర్లోని జోగేంద్ర స్టేడియం లో అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించ బోతున్నారు అధికారులు..జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్స్, ట్రేడ్ మెన్స్ పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేయబోతున్నారు.

ఈ జులై 31వ తేదీన అగ్ని ర్యాలీ నిర్వహించనుండగా సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ ఈవెంట్లు కొనసాగను న్నాయి. అటు వివిధ కేటగిరీలలో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించబోతున్నారు.

ఇక ఈ అగ్ని వీరు పోస్టుల భర్తీపై… AOC సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ను సంప్ర దించాలని అధికారులు చెబుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular