హైదరాబాద్, నిఘా న్యూస్: పరీక్షల విధానం, విద్యార్థుల డ్రాపౌట్ తదితర అంశాలపై ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పాఠశాల విద్యాశాఖల అధికారులకు కేంద్ర విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం సదస్సు నిర్వహించింది. జాతీయ విద్యావిధానాలు అమలే ఎజెండాగా ఈ సదస్సు జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పాఠశాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇంటర్ బోర్డును ఎత్తివేయాలనే ప్రతిపాదనను రాష్ట్రాల ముందు ఉంచింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను ఒకే గొడుకు కింద కు తేవాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.
ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే టెన్త్, ఇంటర్ కు వేరువేరు బోర్డులు ఉన్నా యి. వాటిల్లోనూ ఒక్క బోర్డు ఉంటేనే మంచిందని కేంద్రం సూచించింది. సీబీఎస్ఈతోపాటు 20 రాష్ట్రాల్లో అలాగే ఉంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం కూడా ఇంటర్మీడియట్ వరకు పాఠశాల విద్యాశాఖలోనే ఉండాలి.
దేశవ్యాప్తంగా అన్ని బోర్డుల పరిధిలో ఒకే విధంగా, ఒకే ప్రమాణాలతో ప్రశ్నాపత్రా లను రూపొందించాల్సిన అవసరం ఉంది. సీబీఎస్ ఈలో 20 మార్కులకు అంతర్గత మార్కులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధానం ఉండగా..
తెలంగాణలో తొలగించ డానికి కారణం ఏమిటి..? వృత్తి విద్యకు కూడా పాఠశాలల్లో పెద్దపీట వేసి వారికి ధ్రువపత్రాలను అందజేయాలి. అందుకు బోర్డుల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర సూచించింది.ఒకే బోర్డు పరిధిలో టెన్త్, ఇంట ర్మీడియట్ విద్య ఉండటం వల్ల విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించవచ్చునని కేంద్ర విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో టెన్త్, ఇంటర్మీ డియట్ కు ఒకే బోర్డు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది. అయి తే, సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి వివరిస్తామని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తామని, త్వరలో సమావేశం వివరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు.