Saturday, August 2, 2025

అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో జాతీయ వైద్యుల దినోత్సవం


కరీంనగర్, నిఘా న్యూస్: వైద్య వృత్తి ఆదర్శనీయమైనదని, మానవజాతికి ఒక గొప్ప వరం లాంటిది అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి‌. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని లో అల్ఫోర్స్ టైనీ టాట్స్ లో,& అల్ఫోర్స్ గర్ల్స్ హై స్కూల్ లో వేడుకగా నిర్వహించిన డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డా. బీసీ రాయి గారి జయంతిని పురస్కరించుకుని భారత దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. వారు చేసిన సేవలకు భారతదేశ ప్రభుత్వం గుర్తించి వారి పేరిట ఈ వేడుకలను నిర్వహించడం ద్వారా వైద్య వృత్తిని సమాజంలో గుర్తించబడినదని తెలిపారు. వైద్యులు అన్ని వేళల్లో సేవలు అందిస్తూ కుటుంబాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో మానవజాతికి వారు చేసేటువంటి సేవలు ఎనలేనివని, ప్రశంసనీయమైనవని కొనియాడారు.ప్రస్తుత ప్రపంచంలో మానవాళికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా వైద్యులు కృషి చేస్తున్నారని ముఖ్యంగా పౌష్టికార ఆహారం అందించడం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తూ చెరగని ముద్ర వేసుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పారు.

వేడుకలలో భాగంగా చిన్నారులు వివిధ వైద్య వృత్తిలోని వివిధ విభాగాల విశిష్టతను చాలా చక్కగా వర్ణించి ఆలోచింప చేశారు. ముఖ్యంగా వైద్యులు అందిస్తున్నటువంటి సహాయాలను నృత్యం ద్వారా ప్రదర్శించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైద్య వృత్తికి వన్నెతెస్తున్న వైద్యులకు పూల మొక్కలను అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular