Tuesday, August 5, 2025

బిపిఎల్ కోటాలో కేటాయింపులు అడ్డంకులు ఏంటో..?

వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఉన్నట్టా లేనట్టేనా?.
అనర్హులను గుర్తించారా?. ఇంకెప్పుడూ కేటాయింపులు.
లబ్ధిదారులే మళ్లీ ఎలా అర్హులా?.

కరీంనగర్,నిఘా న్యూస్ : వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు ఉన్నట్టా లేనట్టా?.అని వర్కింగ్ జర్నలిస్టులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజలకు, ప్రభుత్వానికి సమస్యల పట్ల వారధిగా పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుందో అని ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్న వ్యర్ధమే అవుతుందని ప్రభుత్వాలు మారిన జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతుందని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పట్టించుకున్న వారే కరువయ్యారని అని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జర్నలిస్టులు ముసుగులో అక్రిడేషన్లు పొంది. ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు పంపిణీ చేసే పట్టాలను అక్రమంగా పొందుతున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిజమైన ప్రజాశక్తి క్షేత్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని అధికారులు వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి ఇల్లు లేని వారికి ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల కళ నిజం అయ్యేనా? లేదా!. అని జర్నలిస్టులు లో చర్చ జరుగుతుంది.
అనర్హులను గుర్తించారా?. ఇంకెప్పుడూ కేటాయింపులు.
వర్కింగ్ జర్నలిస్టుల ముసుగులో కొందరు గత ప్రభుత్వ హయాంలో పీఏలకు, ఇంటి పని మనుషులకు, ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేశారంటూ వర్కింగ్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న శూన్యమే అని వాపోయారు. ప్రజలకు, ప్రభుత్వాలకు సమస్యల పట్ల వారధిగా పనిచేసే జర్నలిస్టుల సమస్యలే పరిష్కరించలేని అధికారులు సామాన్యుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతుందని జర్నలిస్టుల్లో చర్చ మొదలైంది. అనార్హులను గుర్తించారా? లేదా ప్రశ్నార్ధకంగా మారింది. అనార్హులను గుర్తిస్తే వారిని పట్టాల ఎప్పుడు రద్దు చేస్తారు. వర్కింగ్ జర్నలిస్టులకు పట్టాలు లేనివారికి ఎప్పుడు కేటాయింపులు చేస్తారు. అని జర్నలిస్టులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. జర్నలిస్టుల ముసుగులో ఉన్న అనార్హులను తొలగించి వర్కింగ్ జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని. ప్రభుత్వం ,ఉన్నతాధికారులు త్వరలో జర్నలిస్టుల ఇల్లు లేని వారి కళ నెరవేర్చాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లబ్ధిదారులే మళ్లీ ఎలా అర్హులా?.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల కోటాలో సుమారు 70 నుంచి 80 మంది జర్నలిస్టులు లబ్ధి పొందినట్లు సమాచారం. గత బి ఆర్ ఎస్ పార్టీ హయాంలో కూడా లబ్ధి పొందిన జర్నలిస్టులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు వారికి పట్టాలు పొందారని జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. లబ్ధి పదిన వారే మళ్లీ ఎలా అర్హులు అవుతారని పట్టాలు పొందని కొందరు సీనియర్ వర్కింగ్ జర్నలిస్టులు వాపోయారు. గత ప్రభుత్వ హయాములో ప్రభుత్వానికి సానీత్యంగా ఉన్న జర్నలిస్టులకే మళ్లీమళ్లీ పట్టాలు ఇచ్చారని బహిరంగంగా చర్చ జరుగుతుంది. లబ్ది పొందిన వారే మళ్లీ లబ్ధి పొందుతే. ఏళ్ల తరబడి వర్కింగ్ జర్నలిస్టుగా కొనసాగుతున్న వారి పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జారీ చేసే ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలు. వర్కింగ్ జర్నలిస్టుల కా?. అధికార పార్టీకి కొమ్ముకసే వారికా అని జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు,అధికార పార్టీ పునర్ ఆలోచన చేసి వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే పనిచేస్తున్నారో వారిని గుర్తించి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసిన హామీలు ఇస్తున్నారు. తప్ప సమస్యలను పరిష్కారం చూపెట్టలేదు అని వర్కింగ్ జర్నలిస్టులు వాపోతున్నారు. అధికార పార్టీ ఇప్పటికైనా వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి జర్నలిస్టుల కళ నెరవేర్చాలని ప్రభుత్వానికి జిల్లా మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
బిపిఎల్ కోటాలో కేటాయింపులు. అడ్డంకులు ఏంటో.
కరీంనగర్లో ప్రజా సమస్యలు ప్రభుత్వానికి వారధిగా చేరవేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల తలాల పంపిణీ. బిపిఎల్ కోటాలో కేటాయించామని గత ప్రభుత్వ హయాములో ఇచ్చినట్లు చర్చ , బిపిఎల్ కోటాలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తే కొంతమందిని సీనియర్ , వర్కింగ్ జర్నలిస్టులను ఎందుకు పక్కన పెట్టారని గత ప్రభుత్వంలో చేసిన నాయకులపై తీవ్రంగా స్థాయిలో మండిపడుతున్నారు. బిపిఎల్ కోట అంటే (బిలో
పావర్టీ ) వారికి ఇళ్ల స్థలాలు కేటాయించినప్పుడు ఎందుకు కొంతమందికి ఇవ్వలేదని అందరినీ ఒకేలా పట్టాలు పంపిణీ చేస్తే సమస్యలు ఉండేవి కావు కదా?. కొంతమందిని గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీపై ఉన్నది ఉన్నట్టు రాసిన జర్నలిస్టులను పక్కన పెట్టారని సీనియర్ వర్కింగ్ జర్నలిస్టులు వాపోతున్నారు. ఇప్పటికైనా బిపిఎల్ కోటాలో వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని అనర్హులను తొలగించాలని. అర్హులకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు కేటాయించాలని వెంటనే పంపిణీ చేయాలని వర్కింగ్ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular