హైదరాబాద్, నిఘా న్యూస్:పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు షాక్ తగిలింది. భూదాన్ భూముల వ్యవహారంలో సీనియర్ అధికారులపై సంచలన ఆరోపణలు వచ్చాయి. మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంలో భూదాన్ భూముల ను లే అవుట్ చేసి అమ్మిన వాళ్లపై ఈరోజు ఉదయం ఈడీ సోదాలు నిర్వహించింది..
మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫానా, సుఖుర్ ఇళ్లపై ఈడీ సోదాలు చేపట్టింది. భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే.. ఆల్ ఇండియా సర్వీసెస్ తాజా మాజీ అధికారుల పాత్రపై హైకోర్టు మండిపడింది.
ఉన్నతాధికారులకు పాత్రపై విచారణ జరిపించాలని హై కోర్టులో పిటిషన్ దాఖలైంది.. రెవెన్యూ అధికారుల సాయంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుటుంబ సభ్యుల పేర్ల మీద భూములు బదలాయింపులు చేసినట్లు ఆరోపణలున్నాయి..
ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ, సీబీఐలకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ.. అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉంది.