అమరావతి, నిఘా న్యూస్:అమరావతి సచివాలయం లో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది, సిఆర్డిఏ,46వ అథారిటీ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది…ఈరోజు ఉదయం 11 గంటలకు అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్- 2 భూ సేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారుఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నా రు. దీంతో పాటు సీఆర్డీఏ 46వ ఆథారిటీ సమావేశం లో అమోదించిన పనులకు ఆమోదం తెలపనున్నారు.
ఇక, ఉండవల్లి, పెనుమాక లోని జరీబు భూముల రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు కేబినెట్ అథా రిటీ ఆమోదం తెలపనున్నా రు.ఇక, అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు సీఆర్డీఏకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
అమరావతిలో నిర్మించే హైకోర్టు, అసెంబ్లీ భవనాల టెండర్లు దక్కించుకున్న సందస్థలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం లభించనుంది. సీఆర్డీఏ నుంచి ఏడీసీకి 473 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం ఉంది.
SIPB సమావేశంలో అమోదించిన వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టు బడులు, 32,133 ఉద్యో గాలు వచ్చే ప్రతిపాదనలకు ఇప్పటికే అమోదం తెలపిన SIPB.. ఇక, ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు జరిగేలా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.