కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్, నిఘా న్యూస్ : హనుమాన్ జయంతి సందర్భంగా శనివారంనాడు కరీంనగర్ నగరంలో నిర్వహించు వీర హనుమాన్ విజయయాత్ర కొరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ విధుల్లో పాల్గొంటున్న అధికారులకు ఆయన బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 450 మంది పోలీసు అధికారులు ఈ బందొబస్తు విధుల్లో పాల్గొంటున్నరన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూఫ్ టాప్, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు ఇలా పలు రకాల విధులు కేటాయించామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టామని తెలిపారు.వీర హనుమాన్ విజయాత్ర ర్యాలీ కి పోలీస్ శాఖ తరపున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని కరీంనగర్ పోలీసు కమీషనర్ తెలిపారు.