Sunday, August 10, 2025

వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం..

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియో లో పుట్ట మధు పేరు ఉం దా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అలాగే, కేసుకు సంబం ధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి పరిశీలన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా న్యాయ వాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐకి అప్ప గించేందుకు అభ్యంతరం లేదని ఇప్పటికే చెప్పింది. న్యాయవాదులైన దంపతులు ఇద్దరినీ కోర్టు ప్రాంగణంలోనే హత్య చేశారని.. దీనికి సంబం ధించిన వీడియోలన్నీ ఉన్నాయని వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అందరూ చూస్తుండగానే ఇద్దరినీ అత్యంత కిరాత కంగా చంపారన్నారు.అవే వీడియోలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపించారు. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చా రని.. కేసును కొట్టివేయాల ని పుట్ట మధు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.మరణ వాంగ్మూలంలో ఎవరి పేరూ చెప్పలేదని.. కావాలంటే దానికి సంబం ధించిన వివరాలు కోర్టుకు అందిస్తామన్న తెలిపారు. మరణ వాంగ్మూలాన్ని ట్రాన్స్‌క్రిప్ట్‌ చేసి ఇస్తామని.. దీనికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తదుపరి విచారణను జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ ధర్మాసనం వాయిదా వేసింది. తాజాగా మరోసారి విచారణ జరిగింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular