కరీంనగర్, నిఘా న్యూస్: ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మన కరీంనగర్ అదిలాబాద్ జిల్లా ల విద్యార్థులు ఉన్నత మంచి విద్యను అభ్యసించాలంటే విజయవాడ వైజాగ్ లాంటి ప్రదేశాలు వెళ్లసిన పరిస్థితి ఉండేది కానీ ఆ సమయంలో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి మన కరీంనగర్ కేంద్రగా మంచి విద్యను అందించే ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు మంచి విద్యను అందించాడు. అలాంటి నరేందర్ రెడ్డి పైప్రతిపక్షాలు అయినటువంటి బీజేపీ అసత్య ప్రచారాలను సోషియల్ మీడియా వేదికగా చేస్తున్నారు మన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ అసత్య ప్రచారాలను తిప్పికొట్టి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.
అంతేకాక మన ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఉచిత కరెంట్ ఉచిత బస్సు సౌకర్యం వరికి 500 బోనస్ రైతు రుణమాఫీ రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సహాయం అరోగ్య శ్రీ పరిమితి పెంచడం లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టింది.విద్యార్థులకు డైట్ మరియు కాస్మొటిక్ చార్జీలు పెంచడం జరిగింది.ఈ విధంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి కార్యకర్తలు ఓటర్ ల దగ్గరకి తీసుకెళ్ళి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , కరీంనగర్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ జంగా రాఘవరెడ్డి , డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ , ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి నరేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాలా రాజేందర్ రావు , సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పురుమళ్ళ శ్రీనివాస్ , హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ బాబు మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.