పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ తుపాకీతో కాల్చుకున్ని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతిచెందిన ఎస్ఐను ఏజీఎస్ మూర్తిగా గుర్తించారు. కాగా, ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్తహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు స్టేషన్కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, సిబ్బంది 108 వాహనంలో ఎస్ఐ మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తుపాకీతో కాల్చుకొని తణుకు ఎస్ఐ ఆత్మహత్య
RELATED ARTICLES