Sunday, August 3, 2025

మూడు రాష్ట్రాలకు పెట్టుబడులే వేదికగా దావోస్

ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

హైదరాబాద్ నిఘా న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు వారి వారి రాష్ట్రాల కు పెట్టుబడులే సాధనగా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం డబ్ల్యూఇఎఫ్‌,వార్షిక సదస్సుకు హాజరైన సంగతి పాఠకులకు తెలిసింది..

అయితే ఈ క్రమంలోనే మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఒకే వేదిక పంచు కున్నారు. భారతదేశం, రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, స్థిరత్వం, ఉద్యోగాలు, ముందుకు సాగడం వంటి అనేక అంశాలపై రౌండ్ టేబుల్ చర్చలో సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు సరదా వ్యాఖ్యలు చేశారు. అక్కడ నవ్వులు పూయిం చారు. ఈ రౌంట్ టేబుల్ చర్చలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము ఇక్కడి వేదికనే కాదు.. మూడు రాష్ట్రాలు నదులను, సరిహద్దులను కూడా షేర్ చేసుకుంటు న్నాయని చెప్పారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతదేశంలో కంప్యూటర్, టెలికామ్, టెక్నాలజీ సంస్క రణలు తీసుకొచ్చారని చెప్పారు.తర్వాత 1990ల ప్రారంభంలో పీవీ నర్సింహా రావు.. సరళీకరణ, ప్రైవేటీ కరణ, ప్రపంచీకరణను ఎల్‌పీజీ,తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.అలాగే హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా, ఫార్మా హబ్‌గా మార్చేందుకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారని తెలిపారు. ప్రపంచ నగరాలతో తాము పోటీ పడుతున్నామని చెప్పారు. దేశ వృద్దికి సాకారం అందించేలా.. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనుకుంటున్నామని, రేవంత్ రెడ్డి,అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular