ఇన్స్యూరెన్స్ తప్పకుండా చేసుకోవాలి
జమ్మికుంట,నిఘా న్యూస్ :ప్రతి ఒక్క శుభకార్యకర్త నా కుటుంబ సభ్యుడు, సభ్యురాలే అని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ అన్నారు. శనివారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ పై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మనం చేస్తున్న పనికి నామోషీగా ఫీల్ కాకూడదని, ప్రతి పారిశుధ్య కార్మికుడు జమ్మికుంట పట్టణానికి కుటుంబ పెద్ద అని ఆయన అన్నారు. మీరు బాగుంటేనే మున్సిపాలిటీ బాగుంటుందన్నారు. మున్సిపాలిటీల్లో తగిన వాహనాలు లేవని తొందర్లోనే కొనుగోలు చేయడం జరుగుతాయి. ప్రతి నెల విధిగా ఐదోవ తేదీ లోపే జీతాలు వస్తున్నాయి. ప్రతి కార్మికుడు తన కుటుంబ సభ్యుడేనని ఆయన అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఒక పారిశుధ్య కార్మికుడు మరణిస్తే ఆయన కుటుంబానికి ఇన్స్యూరెన్స్ లేకపోవడం వల్ల ఏం లాభం జరగలేదు. అదే ఇన్స్యూరెన్స్ చేసుకుంటే ఈ రోజు ఆ కుటుంబానికి 2లక్షల రూపాయలు ఇన్స్యూరెన్స్ వచ్చేదన్నారు. కావున ప్రతి కార్మికుడు ఇన్స్యూరెన్స్ విధిగా చేసుకోవాలి. మనం చనిపోయిన మన కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ ఇన్స్యూరెన్స్ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ యూనిసెఫ్ సభ్యుడు ఫణీంద్ర కుమార్, జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కిషన్ స్వామి, కో ఆర్డినేటర్ రవీందర్, మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ మహేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సదానందం, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మాతంగి నరేష్, జవాన్లు, మున్సిపల్ కార్మికులతో పాటు ఉన్నారు.