వేములవాడ, నిఘా న్యూస్: దక్షిణకాశి వేములవాడలో మహిళలంతా బొడ్డెమ్మ ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో ఆటపాటలతో కోలాటలతో ఎంతో సంతోషంగా రాజన్న దేవాలయ ప్రాంగణంలో మరియు పలువాడల్లో తెలంగాణా సంస్కృతి ఉట్టిపడేలా బాలబాలికల మహిళలు రంగురంగుల పూలను సేకరించి పకృతి ప్రసాదించిన అందాలన్నీ ఆకాశములో ఇంద్రధనసు రంగులు నింగిపైకి పూలవనములో పొదిగినట్టు అక్కోక్క పువ్వేసి చందమామ ఒక్కజములయే చందమామ అనిపాడుతూ పసుపు ముద్దను గౌరమ్మచేసుకొని గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ రామరామ ఉయ్యాలో రామనశ్రీరామ ఉయ్యాల పాటలమోతలో కోలాటలతో చిన్నారులు ఆనందంగా తెలంగాణా మనసంసృతికి సంప్రదాయం ఉట్టిపడేలా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు మహిళలు,యువతులు, పిల్లలు అనే తారతమ్యం లేకుండ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. పూలనే దేవుళ్లుగా పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగదనే చెప్పవచ్చు. ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డల పూలపండుగ బతుకమ్మ. పూలతో దేవుళ్లను పూజిస్తారు గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగదనే చెప్పవచ్చు. ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డల పూలపండుగ బతుకమ్మ.తెలంగాణ పల్లె జీవితాన్ని ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే వాడవాడలా మహిళలు చిన్నాపెద్దా తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు ఆడే బతుకమ్మ ఆటల్లో ఎంతో ఉత్సాహంగా మహిళలు పాల్గొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఆరాధిస్తున్నారు.తెలంగాణ ఆడపడుచులందరు పేద, ధనిక, చిన్నా పెద్ద, అనే వ్యత్యాసం లేకుండా…బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ వీధి చూసినా రంగురంగుల పూల బతుకమ్మలతో కొత్తశోభను సంతరించుకున్నాయి.రాజరాజేశ్వర స్వామి దేవాలయ దగ్గర బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు,యువతులు, పిల్లలు అనే తారతమ్యం లేకుండా దేవాలయం వెనుకవైపున చేరి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరిగే బతుకమ్మ వేడుకలకోసం ఎటు చూసినా ఆకర్షణీయమైన విద్యుతు దీపాలతో ఆలయ పరిసరాల్లో వెలిగులు విరాజిమ్ముతుంటే అడపడుచులా చేతిలో బతుకమ్మ మెరుపులు విరాజిమ్ముతుంటే పలువురు ఆనందంలో మునిగిపోయారు
వేములవాడలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు
RELATED ARTICLES