కరీంనగర్ శివారోలని అల్పోర్స్ జెన్ నెక్ట్స్ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహింాచారు. వేదికను అందంగా అలంకరించిన అనంతరం శ్రీకృష్ణ పాటలతో విద్యార్థులు నృత్యాలు చేశారు.విద్యార్థులు శ్రీకృష్ణుడు, విద్యార్థినులు గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు అల్ఫోర్స్ అధినేత వి. నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఉట్టి కొట్టే సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులకు సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని అన్నారు.

