Sunday, August 3, 2025

రెజ్లర్లకు భద్రత కల్పించండి: ఢిల్లీ కోర్టు ఆదేశాలు

న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్:భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోప ణలు అప్పట్లో పెద్ద సంచల నం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతి రేకంగా మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు.ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళా రెజ్లర్‌కు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఢిల్లీ కోర్టు నగర పోలీసులను ఆదేశించింది.

ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన అడిషనల్ చీఫ్ జ్యుడీషి యల్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పూత్ .. మహిళా రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని సూచించారు.ముగ్గురు రెజ్లర్లకు బుధవారం రాత్రి భద్రతను ఉపసంహరించుకున్నారని వారి తరఫున న్యాయవాది రెబెక్కా జాన్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై ఢిల్లీ హైకోర్టు గురువారం రోజున విచారణ చేపట్టింది.ఈ మేరకు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ .. రెజ్లర్లకు భద్రతను ఉపసం హరించుకోవడానికి గల కారణాలపై శుక్రవారంలోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీసుల ను ఆదేశించారు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular