సిరిసిల్ల , నిఘా న్యూస్: అడ్వకేట్లకు పోలీసులకు మధ్య కుదిరిన సయోధ్య సివిల్ కేసులలో పోలీసుల అతి ఉత్సాహాన్ని ప్రశ్నిస్తూ సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు గత 16 రోజులుగా కోర్టు విధులను బహిష్కరించారు.కోర్టు ఆర్డర్లు ఉన్న కక్షీదారులపైనే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసేందుకువెళితే అక్కడ అడ్వకేట్లకు సరైన ఆదరణ లభించకపోవడంతో కలత చెందిన న్యాయవాదులు దీక్షలకు పూనుకున్నారు.గత 16 రోజులుగా ఏదో ఒక విధమైన నిరసనతో జిల్లా న్యాయవాదులు ముందుకెళ్లారు. అయినప్పటికిని పోలీసు శాఖలో ఎలాంటి చలనం లేకపోవడంతో కరాకండిగా రిలే నిరాహార దీక్షకు పునుకున్నారు.అంతేకాకుండా హైకోర్టును డిజిపిని కూడా ఆశ్రయించారు.
దీంతో సిరిసిల్ల డి.ఎస్.పి లు చంద్రశేఖర్ రెడ్డి మురళీకృష్ణ ద్వయం బరిలోకి దిగి సమస్యను దిద్దెoదుకు ప్రయత్నించారు. అన్నింటికీజిల్లా కోర్టు జడ్జ్ ప్రేమలత ఈ విషయాన్ని పట్టుదలతో తీసుకొని న్యాయవాదులకు పోలీసులకు మధ్య సయోద్య కుదుర్చడం లో ప్రముఖ పాత్ర పోషించారు.అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంపై మాట్లాడుతూ..సివిల్ తగాదాలలో తాము కలగజేసుకోబోమని అడ్వకేట్ల పైనాడు, నేడు ఎప్పటికీ గౌరవభావం ఉంటుందని కోర్టుకు సంబంధించిన అనుమతుల పట్ల గౌరవంతో ఉంటామని తెలిపారు.దీంతో గత 16 రోజులుగా నడుస్తున్న పోరాటానికి నేడు తెరపడింది.
సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోర్నాల సంజీవరెడ్డి మాట్లాడుతూ…సివిల్ కేసులలో పోలీసుల వైఖరిలో మార్పు రావాలని,మార్పు వచ్చే విధంగా వారే ముందడుగు వేశారని ఇకపై సయోధ్యగా కలిసిమెలిసి పనిచేస్తామని తెలిపారు.వేములవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడిసె సదానందం మాట్లాడుతూ.. సయోధ్యకు వచ్చిన పోలీసుల శాఖకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో న్యాయశాఖ పోలీస్ శాఖ మధ్య సమన్వయం చాలా అవసరమని సయోద్య కు పోలీస్ శాఖ రావడం సంతోషకరమని తెలిపారు.ఇది ఏమైనాప్పటికిని పౌర హక్కుల రక్షణ న్యాయవాదుల బాధ్యత అనే అంశం దీంతో బలపడింది. దీంతో కక్షిదారులు ప్రజలు ఊపిరిపించుకున్నారు…