Wednesday, August 6, 2025

అర్ధరాత్రి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీకి దొంగల యత్నం

పల్నాడు, నిఘా న్యూస్: నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీకి విఫలయత్నం చేశారు దొంగలు. రైలుపై రాళ్లు రువ్వి.. చైన్‌ లాగి రైలులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. బీ-1, ఎస్‌-11, ఎస్‌-12 కోచ్‌లలో దోపిడీకి యత్నించగా.. కోచ్‌ లలో డోర్లు వేసి ఉండటంతో లోపలికి ప్రవేశించలేక పోయారు.పల్నాడు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్‌ దగ్గర శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసు కుంది. రెండురోజుల క్రితం చెన్నై, నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైల్లో రాజాగా దోపిడీకి పాల్ప డ్డారు. దొంగలు. ప్రయాణి కుల నుంచి బంగారు చైన్లు లాక్కెళ్లారు.

ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి కూడ అదే తరహాలో మరోసారి దొంగలు రెచ్చి పోయారు. దీంతో.. ప్రయాణి కులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.మరోవైపు.. వరుస రైలు దొంగతనాలతో ప్రయాణి కులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనల పైరైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular