కరీంనగర్, నిఘా న్యూస్:మన దేశం సైనికులచే అన్ని దిక్కులలో మరియు రంగాలలో రక్షింపబడుతున్నాయని మరియు దేశ అభివృద్ధికి వారు పునాదులని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో దేశభక్తి నింపే విధంగా మరియు స్పూర్తిదాయకంగా నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు. అంతకు ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అమరవీరుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారు చేసిన త్యాగలను మరియు సేవలను స్మరించుకున్నారు.
కార్గిల్లో సైనికులు పోరాడిన విధానం మన దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పారు. యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడు అతి తక్కువ వయస్సు కలవారని జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించకుండా దేశం కోసం త్యాగం చేసి మన అందరి హృదయాలలో చరగని ముద్ర వేసుకొని మన అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని చెప్పారు. కార్గిల్ వీర సైనికులచే మనమందరం రక్షింపబడ్డామని లేకపోతే పరిస్థితి ఊహించని విదంగా ఉండేదని చెప్పారు. భారత పౌరునిగా ప్రతి ఒక్కరు కార్గిల్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి దేశ భక్తి చాటాలని సలహ ఇచ్చారు.
కార్గిల్ విజయదివాస్ భారతదేశానికి ఒక గొప్ప రోజని మరియు సైన్యానికి వారు చేసిన త్యాగాలను వర్ణించే రోజు అని చెప్పారు. ప్రపంచంలో మరే యుద్ధం జరగని తీరు కార్గిల్ యుద్ధంలో జరిగినదని ఎంతో మంది సైనికులు దేశ రక్షణకై ప్రాణాలను అర్పించారని తెలుపుతూ వారు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కార్గిల్లో వీర మరణం పొందిన సైనికులకు మనమైన పుష్పాంజలిని మరియు వారి కుటుంబ సభ్యులకు దేశం ఎల్లప్పుడు బాసటగా ఉంటుందని చెప్పారు. జై భారత్ జై జవాన్, దేశానికి రక్షకుడు సైనికుడు మరియు కార్గిల్ అమరవీరులకు జోహార్లు, జోహార్లు అనే వినాదాలతో ప్రాంగాణాన్ని అలోచింపచేసే విధంగా చాలా చక్కగా అలంరించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు అమరుల త్యాగాలను స్మరిస్తూ మరియు దేశభక్తిని నృత్యాలతో, దేశభక్తి గేయాలతో మరియు నాటికలతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.