కరీంనగర్, నిఘా న్యూస్: ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని, పీఎఫ్ డబ్బులు కార్మికుల కథలో జమ చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులకు ఐడి కార్డులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ యాజమాన్యం యొక్క సూపర్వైజర్ లు వేధింపులు అరికట్టాలని ప్రభుత్వ ఆస్పటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ ఆధ్వర్యంలో వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నవీనకు వినతిపత్రంను అందించారు. ఈ వినతిపై వెంటనే స్పందించిన డిఎమ్ఈ గారు కరీంనగర్ ప్రభుత్వ హాస్పటల్ సూపర్డెంట్ గారితో, కాంట్రాక్ట్ యాజమాన్యంతో మాట్లాడినారు. సమస్య మరోసారి ఉత్పన్నమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ జీతాలు ఇతర సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.హైదరాబాదులోని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నవీన గారిని కలిసిన వారిలో ప్రభుత్వ ఆస్పటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్, కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష, కార్యదర్శులు పిఅరుణ్, టి. కళావతి, ఉపాధ్యక్షులు పి. శారదా పాల్గొన్నారు.
పెండింగ్ జీతాలు, ఇతర సమస్యలు పరిష్కరించండి
RELATED ARTICLES