గార్ల జులై 22( నిఘాన్యూస్)సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని సూర్య తండా ముత్తి తండా పూసల తండా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తగిన మందులను పంపిణీ చేశారు అనంతరం ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి యాంటీ లార్వా తిమోఫాస్ స్ప్రే చేశారు సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతలను పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని దోమలు కుట్టకుండా పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సాధ్యమైనంతవరకు ఇంటిలో తయారు చేసిన వేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని 20 నిమిషాలు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వల్ల ఈ సీజన్లో వచ్చే టైఫాయిడ్ వాంతులు విరోచనాలు లాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని వారికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
