ఒడిశా, నిఘా న్యూస్ :పూరీ జగన్నాధుని క్షేత్రం లోని రత్న భాండాగారం సుమారు 46ఏండ్ల తర్వాత తెరవడంతో అందులోని జగన్నాథుడి సంపదలపై యావత్తు దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.పురుషోత్తముడి భక్తులైన రాజులు సమర్పించిన విలువైన కానుకలు, వజ్రవై ఢూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, బంగా రం కిరీటాలు ఈ మేరకు భద్రంగా ఉన్నాయనేది నేడు చూడనున్నారు.ఈరోజు రహస్యగదిని తెరవనున్నారు. అందులోని పెట్టెలు, అల్మరాలను ఒడిశా సర్కార్ నియమించిన కమిటీ సభ్యులు తెరిచి సంపదను స్ట్రాగ్ రూమ్ కు తరలిస్తారు.
జులై 14న ఆ గదిని కమిటీ ప్రతినిధులు కేవలం పెట్టెలు, అల్మరాలు చూసి వెనక్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు సమయం మించి పోవడంతో సీల్ వేశారు.ఈరోజు గురువారం మళ్లీ తెరచి భారీ భద్రత నడుమ రహస్య గదిలోని సంపద స్ట్రాంగ్ రూముకు తరలిం చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.