Wednesday, August 6, 2025

ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..

అమరావతి, నిఘా న్యూస్: ఏపీలో భారీ విజయం సాధించిన కూటమి సర్కార్..అదే తరహాలో ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెబుతోంది. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. సీఎం చంద్రబాబు. సామాన్యుడికి మేలు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటు న్నారు.ఇప్పటికే ఏపీలో పింఛన్లకు స్వీకారం చుట్టిన చంద్ర బాబు..మరో హామీ అమ లుకు సిద్ధమైనట్లు సమాచా రం. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడ బిడ్డ నిధి పథకాన్న త్వర లోనే కార్యాచరణలోకి తీసుకువచ్చే విధంగా సీఎం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.మేనిఫెస్టోలో చెప్పిన విధం గా ప్రతీ పథకాన్ని అమలు చేసే యోచనలో ఏపీ సర్కా ర్ ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే 18ఏళ్లు నిండిన ప్రతీ మహిళల ఖాతాలో ఫ్రీగా నెలకు రూ. 1500చొప్పున జమ చేసే విధంగా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్ట బోతోంది.

అయితే ఈ పథకం దరఖా స్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాల వివరాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నడుస్తోంది. ఆ వివరాల ప్రకారం..ప్రతి మహిళలకు 18ఏండ్లు వయస్సు దాటి ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి. అదేవిధంగా పుట్టిన తేదీ ధ్రువపత్రము, మహిళ పేరుతో బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి.ఈ వివరాలతో కూడిన సమాచారం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వచ్చే నెలలో ఈ స్కీం ప్రారం భించేందుకు ప్రభుత్వం కస రత్తు చేస్తోందని చెబుతు న్నారు. అటు నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సిద్ధం చేశారు.

సీఎంగా బాధ్యతలు స్వీక రించిన నెలరోజుల లోపే ఇసుక పాలసీని తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక విధానా న్ని రద్దు చేసి నూతన ఇసు క విధానం తీసుకువస్తు న్నారు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular