పిహెచ్సిలో ప్రసవంపై గర్భిణుల ఆసక్తి.
2 నెలల్లో 15 సాధారణ ప్రసవాలు
ఖమ్మం, నిఘా న్యూస్: నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని ఓ సినీ రచయిత రాసిన పాటను మండల పరిధి దెందుకూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తిరగరాస్తు న్నారు.నేను పోతా సర్కారు దవాఖానకు అని ప్రజలు అంటున్నారు.ప్రజలు ప్రధానంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేది విద్య, వైద్యంపైనే.రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి అధిక ప్రాధాన్యతనిచ్చిం ది.దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ప్రభుత్వ దవాఖాన ల్లో వైద్యం పొందే వారి సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతున్నది.సమగ్ర రక్షణ వ్యవస్థతో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి.మాతా శిశు మరణాలు తగ్గాయి. ఖమ్మం జిల్లా మధిర పరిధి దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై కలం నిఘా ప్రత్యేక కథనం..
మే నుంచి జూన్ వరకు 2 నెలల్లో రిజిస్టర్ అయిన వారిలో 48 గర్భిణులు ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించగా 15 మంది సాధారణంగా ప్రసరించారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వి నాయక్ తెలిపారు.గర్భం దాల్చిన మొదటి నెలలో సంబంధిత ప్రభుత్వ దవాఖానల్లో రిజిస్టర్ చేసు కుంటే బిడ్డ పుట్టే వరకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం,ఎత్తు,బరువు తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తం అవసరమైతే వైద్య సిబ్బందే అంబులెన్స్‌లో పై దవాఖానాలకు తీసుకెళ్లి, అందేలా చర్యలు తీసుకుం టున్నారు.
తల్లీ,బిడ్డా ఆరోగ్యానికి అవసరమైన మందులను ఇస్తున్నారు.అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహార అందజేస్తున్నారు.6 నెలల నుంచి ప్రసవించే వరకు వైద్యాధికారి పర్యవేక్షిస్తు న్నారు.అన్ని రకాల చర్యల తో మహిళలు సాధారణగా ప్రసవిస్తున్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్న మహిళలకు ప్రభుత్వం బేబీ కిట్ అంద జేస్తుంది.అందులో చంటి పిల్లలకు అవసరమైన వివిధ రకాల వస్తువులు అందుబా టులో ఉన్నాయి.అదే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకుంటే రూ.50వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుం ది.దీంతో దెందుకూరు పీహెచ్సీ పరిధి గ్రామాల పేద,మధ్య తరగతి వారు ప్రభుత్వ ఆసుపత్రి నే ఆశ్రయిస్తున్నారు.ఇక్కడ పీహెచ్‌సీలో వంద శాతం సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి.డాక్టర్లు, నర్సులు వైద్యం మంచిగా అందిస్తున్నారని గర్భిణీలు చెబుతున్నారు.
సర్కారు దవాఖానలో ఉచిత పరీక్షలు
పీహెచ్‌సీలో 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు.రోగుల నుంచి నమూనాలు సేకరిం చి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు.మలేరియా, టైఫాయి డ్,చికున్‌గున్యా, డెంగీ, పూర్తిస్థాయి మూత్ర పరీక్షలు, షుగర్, ఏఎస్‌ఓ, సీఆర్‌పీ,ఆర్‌ఎఫ్,ఆర్‌పీఆర్, బ్లెడ్ పర్సంటేజీ, బ్లెడ్ గ్రూపు, సీబీపీ, బీటీ/సీటీ,హెచ్‌బీ ఎస్, ఈసీఆర్, వీడీఆర్‌ఎల్, ఆర్‌బీఎస్,ఎఫ్‌బీఎస్,పీబీఎస్, ఆర్‌డీటీ,యూపీటీ టెస్టులతో పాటు…కోవిడ్-19, ఆర్‌టీ, ఆర్టీపీసీ ఆర్, కఫం టెస్టు, హెచ్‌ఐవీ, హెచ్‌బీ ఏఐసీ, ఎఫ్‌బీ-ఎస్, పీఎల్‌బీఎస్, జీటీటీ, ఓజీసీ టీ, థైరాయిడ్ 3 రకాలు.. టీ-3, టీ-4, టీఎస్-లివర్, సీరంలో మూడు రకాలు.. టోటల్ ప్రొటీన్, సీరం ఏ/బీ రేషియో, ఎస్‌ఈపీటీ/ఏఎల్ టీ, ఎస్‌జీఓటీ, ఏఎస్‌టీ, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ఎల్‌డీహెచ్, క్యాల్షియం, యూరిక్ యాసిడ్, కాబో డైరెక్ట్, కాంబో ఇన్‌డైరెక్ట్ వంటి పరీక్షలు స్థానిక పీహెచ్‌సీల్లో ఉచితంగా చేస్తున్నారు.
గర్భిణులకు వైద్య పరీక్షలు

సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకునేందుకు ఇంటిం టి జ్వర సర్వే,కోవిడ్ పరీక్ష లు స్థానికంగా చేస్తున్నారు. ఆశా వర్కర్లు నిత్యం పర్యవే క్షణ చేస్తున్నారు.నెలసరి చెకప్ కోసం ఆశా వర్కర్లు ప్రభుత్వ వాహనాల్లో గర్భిణులను పెద్దాస్పత్రికి తీసుకెళ్లి పరీక్షల అనంతరం పైసా ఖర్చు లేకుండా ఇంటికి పంపిస్తున్నారు.ఒకసారి గర్భిణి ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే స్కానింగ్ టెస్టులు, మందులు ఇలా.. కనీసం రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు వస్తుంది.అలాంటి వాటిని ప్రభుత్వమే భరిస్తున్నది. గర్భం దాల్చిన్నప్పటి నుంచే వారికి అన్ని రకాలుగా వైద్య సేవలు అందుతున్నాయని, డా ” పృధ్వి నాయక్ తెలిపారు…