Friday, February 7, 2025

బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి

బీఆర్ఎస్ ఓటు మురిగి పోవద్దు అంటే బీజేపీ కి ఓటు వేయాలి

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును గెలిపించాలి

మధిర లో భారీ బహిరంగ సభ వక్తల పిలుపు

బిజెపిలో చేరిన టిడిపి వార్డు కౌన్సిలర్

మధిర,మే 4(నిఘా న్యూస్): కాంగ్రెస్ బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి బిజెపికి అవకాశం కల్పించాలని పలువురు వక్తలు కోరారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి మధిరలో కమల దళ శంఖారావ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడారు. ఈ పదేళ్లలో మన విద్య కోసం కళాశాలలు, ఉపాధి కోసం పరిశ్రమలు, వ్యవసాయదారుల కోసం పరిశ్రమలు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ లు ఉన్నాయా అని ప్రశ్నించారు.

ఖమ్మం ఏం పాపం చేసింది గతంలో పనిచేసిన ఎంపీలు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలలో అడిగిన వారికి అడిగినంత ఇచ్చారని ఖమ్మం గురించి ఎంపీలు ఎందుకు అడగలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లను గెలిపిస్తే వారు స్వంత లాభాల కోసం కుటుంబీకుల కోసం కృషి చేస్తారు తప్ప మన ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మన కోసం మన ప్రజల కోసం ఆలోచించడం లేదన్నారు. కనీసం వారికి ఆలోచించే టైం కూడా లేదన్నారు. ఒక రేమో కొడుకు, ఇంకోరు వారి భార్య కోసం మరొకరు తమ్ముడి కోసం పార్లమెంట్ టికెట్లు ఇప్పించుకొని కార్యక్రమంలో ఉంటే చివరికు వియ్యంకుడు కు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఇక్కడ పుట్టిన బిడ్డను కాబట్టి ఇక్కడ సమస్యలు తెలుస్తాయి మనం ఏ అభివృద్ధి చేసుకుంటే మంచిదో మనకు అర్థమవుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత దేశం ని ప్రపంచంలోనే మంచి దేశంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుందని మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు.

600 సంవత్సరాలు అయోధ్య కల సహకారం చేసిన మహానాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. మనకి ఏ అవసరాలు ఉన్నా తీర్చడానికి మోడీ ఉన్నారని వారిని తీసుకురావడానిక ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసారి ఖమ్మం చరిత్ర సృష్టించబోతుందని , మీరందరూ చైతన్యవంతులు కాబట్టి కాంగ్రెస్ మోసగాళ్లకు బుద్ధి చెప్పి మన అభివృద్ధికి మనం ఓటు వేసుకుందాం అన్నారు. ఈవీఎం బ్యాలెట్ లో నాల్గో నంబర్ మీద ఓటేసి కమలం గుర్తు కు ఓటు వేసి నన్ను గెలిపించి ఢిల్లీకి పంపించాలని కోరారు.సభలో పాల్గొన్న మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రామారావు మాట్లాడుతూ అగ్ర కులాలకు 10 శాతం రిజర్వేషన్ ను గత ఎన్నికల సమయం లో ప్రధానమంత్రి మోడీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాoటి వ్యక్తి రిజర్వేషన్ రద్దు చేస్తారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 400 సీట్లతో మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంటే ఖమ్మం నుంచి తాండ్ర వినోద రావును గెలిపించాలని కోరారు. మధిర ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన భట్టి ఎం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు లేకపోయినా జాతీయ రహదారులు బ్రిడ్జి కట్టించామన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడారు. మోడీ గ్యారెంటీ అంటే ఎలా చేస్తారో తాండ్ర వినోద రావు కూడా అదే గ్యారంటీతో పనిచేస్తారని పేర్కొన్నారు. ఇటీవల బొనకల్లు లో గొర్రెల రుణాలకు సంబంధించి సమస్య వస్తే వినోద్ రావు గారు అధికారులతో మాట్లాడి పరిష్కరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఓటు మురిగి పోవద్దు అంటే బీజేపీ కి ఓటు వేయాలి కోరారు.మధిర టిడిపి 1 వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ పగిడిపల్లి విజయ ఆమె మద్దదదారులు టిడిపి నుంచి బీజేపీ లో చేరారు. సభకు ముందు నిర్వహించిన ఆట, పాట ఆకట్టుకున్నాయి. బిజెపికి ఓటు వేయాలని, నరేంద్ర మోడీ పాలన తీరును కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు,పార్లమెంట్ ప్రభారి శ్రీకాంత్, మహిళా మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వీరపనేని పద్మ, మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు,అసెంబ్లీ ప్రభారీ విష్ణు వర్ధన్ రెడ్డి,పెరుమాళ్ళపల్లి విజయ్ రాజు చిలువేరు సాంబశివరావు, రామిశెట్టి నాగేశ్వరరావు వేణుగోపాల్ రెడ్డి, గుగులోత్ నాగేశ్వరావు, పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి, విరపనేని అప్పారావు, నూతక్కి నరసింహారావు, ఆలస్యం వరప్రసాద్, అలిక శ్రీకాంత్, మర్శకట్ల స్వర్ణకర్ తాళ్లూరి సురేష్, దేవరకొండ కోటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular