కరీంనగర్, నిఘా న్యూస్: లోకసభ ఎన్నికలు సమీస్తున్నందున పోలీసులు మరింత పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అక్రమంగా డబ్బు, మద్యం , గంజాయి మరియు ఇతర పంపిణీ వస్తువుల రవాణా అడ్డుకునేందుకు కరీంనగర్ లోని బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్, వాహన తనిఖీలు ఇతర రద్దీ ప్రదేశాల్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనీఖీలు నిర్వహిస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నియమావళీకి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడి పట్టుబడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు.
కరీంనగర్ లో పోలీసుల విస్తృత తనిఖీలు.
RELATED ARTICLES