పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 24 (నిఘా న్యూస్ ):బుధవారం రోజున జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీయోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే విజయరమణారావు సతీమణితో పాల్గొన్నారు. ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప విజయరమణ రావు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్ష ప్రజలపై ఉండాలని అలాగే లక్ష్మి నరసింహ స్వామి జాతర వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
RELATED ARTICLES