అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్
ధర్మారం, దొంగతుర్తి లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 24 (నిఘా న్యూస్):ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ ధర్మారం మండల కేంద్రంలో దొంగతుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ లలో నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు తరలించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు పూర్తి బాధ్యత ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకే ఉంటుందని, అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడిసిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.