వందేళ్లు ఉండాల్సిన వంతెన వట్టిగాలికే కూలింది
పెద్దపెల్లి ప్రతినిధి ఏప్రిల్ 23 (నిఘా న్యూస్):పెద్దపెల్లి జిల్లా ఓడేడు నుండి గర్మిళ్లపల్లి మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాకపోకల సౌకర్యార్థం మానేరు వాగుపై వంతెన నిర్మాణం సాగించారు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన ఈవంతన నేటికీ పూర్తికాలేదు కాంట్రాక్టర్ల నిర్లిప్తత అలసత్వం పనుల్లో లోపాలు ఉన్నాయని పలు దినపత్రికలో ప్రచురణ మైనప్పటికీ కాంట్రాక్టర్ల పనితీరులో మార్పు రాలేదు. ఈ వంతెన నిర్మాణంలో అనేక అవకాతకం జరిగినట్లు సోమవారం విచిన ఈదురుగాలులకు కూలిన వంతెన నిదర్శనం. రాత్రి వేళలో వంతెన కూలడం వలన ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. జరిగిన సంఘటనలో ఆస్తి నష్టం సేకరించి ఆ నష్టం కాంట్రాక్టర్స్ ల ద్వారా వసూలు చేయాలని ఈ పనులు నడిపిన కాంట్రాక్ట్ సంస్థకు కాంట్రాక్టు రద్దు పరచి ఇంజనీర్లపై కాకుండా సంస్థ యజమాన్యులపై సివిల్ క్రిమినల్ కేసు నమోదు చేసి సిట్టింగ్ జడ్జి చె విచారణ జరిపించాలని ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు