డిసెంబర్ లో చేస్తామన్న రుణమాఫీ ఆగస్టు వరకు వాయిదా వేయడం సిగ్గుచేటు
సకాలంలో పంట రైతు నష్టాలకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళనలు చేస్తాం
రైతన్నలకు అండగా ఉంటమంటున్న బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్22 (నిఘా న్యూస్ ):జిల్లాలో కురిసిన అకాల వర్షం లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం రైతులను పరామర్శించి పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు తీవ్ర అన్యాయం చేసిందని ఈ యాసంగి పంటల వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతలను మోసం చేసిందని ఆమె దుయ్యబెట్టారు. రైతన్నలను అనేక ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలకు ఓట్లు అడగడానికి రావడం సిగ్గుచేటు ఆమె మండిపడ్డారు. డిసెంబర్ ఆరవ తారీకు వరకు రుణమాఫీ ఇస్తామని ఇప్పుడు తీరా మాట మార్చి ఆగస్టు పదిహేను వరకు చెల్లిస్తామనడం ముఖ్యమంత్రి చేతకానితనం అవివేకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. గారడి మాటలు గ్యారంటీలా అమలును ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఆమె స్పష్టం చేసింది నష్టపోయిన రైతన్నల పక్షాన టిఆర్ఎస్ నాయకత్వం అండగా ఉంటుందని రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరింంచింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఈశ్వరన్న ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని రైతులను కోరింది రైతన్నల కుటుంబాలకు న్యాయం జరగాలంటే అది మన బీ ఆర్ఎస్ నాయకులతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చందు లక్ష్మి దాసరి రాజమల్లు కుమ్మరి కుంట కుమార్ సంపత్ అమూదాల అరుణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు