విశాఖపట్నం, నిఘా న్యూస్: 2014-19 టిడిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు కూడా అదే తరహాలో కూటమి ప్రభుత్వం రాగానే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని గంట హామీ ఇచ్చారు. మధురవాడ సాయిరాంకాలనీ లో కళ్యాణమండపం నిర్మిస్తామని, నీటి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధి ఎజెండా తో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం లో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమ బాధ్యత తనదని అన్నారు. అధికారంలోకి రాగానే మధురవాడలో మూడు వేల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి , మరియు శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
