–40 డిగ్రీలు దాటిన ఎండ తీవ్రత..
–పిట్టల్లా రాలుతున్న జనాలు..
– వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు…
గంభీరావుపేట మార్చి 6 (నిఘా న్యూస్ ):సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గంభీరావుపేటలో ఉదయం నుండి దాదాపు 36 -40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం 9 నుంచి మొదలవుతున్న ఇండస్ట్రీగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నది. వడగాలుల ప్రభావంతో జనం ఇంటిపట్టునే ఉంటూ కూలర్లు ఏసీల కింద సేద తీరుతున్నారు. ఎండలకు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
వీటిని చేయొద్దు..
- ఎండలు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.
- ఎండా కాలంలో మద్యం తాగొద్దు.
- రోడ్లపై విక్రయించే రంగు పానీయాలు అసలు తాగొద్దు.
- ఫుట్‌పాత్‌లపై విక్రయించే ఆహారం తినొద్దు.
- మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి.
- ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇలా చేయండి..
- నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
- రోజూ 15 గ్లాస్‌ల నీరు తాగాలి.
- పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
- మిత ఆహారం తీసుకోవాలి.
- రెండు పూటల స్నానం చేయాలి.
- కాటన్ దుస్తులు ధరించాలి.
- ఇంటి బయట నిద్రపోతే దోమతెర కట్టుకోవాలి.
- ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి లేదా టోపీ పెట్టుకోవాలి.
- ఇంట్లో కిటికీలు తెరిచి ఫ్యాన్‌వేసి గది చల్ల బడేలా చూడాలి.
- రోజూ మజ్జిగ తాగాలి
వేసవిలో వడ దెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. వేడి చేస్తుంది. బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో పెట్టిన నీరు, శీతల పానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. జ్యూస్, మజ్జిగ తయారు చేసుకొని ప్రతిరోజూ తాగాలి.
వడదెబ్బ తగిలితే ఇలా చేయాలి
- వడ దెబ్బతగిలిన వ్యక్తిని నీడలో పడుకోబెట్టాలి.
- చల్లని నీటిలో లేదా ఐస్‌లో ముంచిన గుడ్డతో శరీరం అంతా తుడవాలి. సాధారణ స్థితికి వచ్చే వరకు ఇలా చేయాలి.
- ఇంట్లో ఫ్యాన్ గాలి, లేదా చల్లని గాలి తగిలేలా ఏర్పాటు చేయాలి.
- ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ వాటర్, ఓఆర్‌ఎ్‌స తాగించాలి.
- వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
ఎండలో తిరగొద్దు…
-డా. సృజన్ సిహెచ్ సి వైద్యాధికారి, గంభీరావుపేట.

వడదెబ్బకు గురికాకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు గర్భిణీలు వృద్ధులు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. వడదెబ్బ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి… అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కు కాల్ చేసి రోగిని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.