కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామ శివారులోని వరద కాలువ 102 వ గేటు వద్ద చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గంగాధర రామడుగు బోయిన్ పల్లి మండలాలలోని రైతుల సాగునీటీ అవసరాల కొరకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నిన్ను నియోజకవర్గ పూర్తిగా మెట్ట ప్రాంతం ప్రతి గుంటకు నీరందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు నీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లను కోరడంతో నీటి విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు చొప్పదండి నియోజకవర్గ రైతులను ఆదుకుంటామని తెలిపారు బి ఆర్ ఎస్ పాలనలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితి గత ఎమ్మెల్యే గత ప్రభుత్వానిది అని విమర్శించారు మా రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని ఒక గుంట కూడా ఎండిపోకుండా కాపాడుకుంటామని రాష్ట్రవ్యాప్తంగా నీటి ఇద్దరి ఉన్న కూడా నియోజకవర్గంలో సమృద్ధిగా నీరు అందిస్తామని తెలిపారు
సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
RELATED ARTICLES