న్యూ ఢిల్లీ (నిఘా న్యూస్) లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన కొనసా గిస్తున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచి ప్రభుత్వానికి సంబంధించిన తొలి అధికా రిక ఉత్తర్వులు ఆదివారం జారీ చేసినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. జలవనరుల శాఖకు ఈ ఆర్డర్స్ జారీ చేసినట్టు సమాచారం. ఢిల్లీలో నీటి సరఫరాకు చెందిన ఈ ఆదేశాలు జలవనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపడుతున్న అతిశీకి ఓ నోట్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్‌ను ఈ నెల 21 లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీంతో కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభు త్వాన్ని నడుపుతారని ఆప్ స్పష్టం చేసింది. అయితే అప్పటి నుంచి జైలుకు వెళ్లిన వ్యక్తి ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తొలి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం..
జైల్లోనే సీఎం ఆఫీస్ ఇక్కడినుండే రాష్ట్ర పరిపాలన
RELATED ARTICLES