నిఘా న్యూస్, విశాఖపట్నం: విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు గా 25 వేల కిలోల డ్రగ్స్‌ను ఆపరేషన్ గరుడ పేరు తో సీబీఐ మరియు కస్టమ్స్ అధికారులు కలిసి సీజ్ చేశారు. కంటేనర్ నుండి వేయి బ్యాగులను స్వాదినం చేసుకున్నారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంత మొత్తం లో దొరకటం తో నగరం దేశం మొత్తం షాక్ కు గురైంది. బ్రెజిల్ నుంచి విశాఖపట్టణం పోర్టుకు డ్రగ్స్ వస్తున్నాయని ఇంటర్ పోల్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చింది. కస్టమ్స్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ కు ఎలాంటి రాజకీయ వత్తిడి లేకుండా ఎన్నికల నియమావళి తో చకచక్యం గా అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థ డ్రగ్స్ దిగుమతి చేసిందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ విషయం పై టిడిపి నేత నారా లోకేష్ స్పందిస్తూ వై సి పి చివర గట్టం గా ఎన్నికలకు పంపకాలకు డ్రగ్స్ ను వాడేందుకు ఇలాంటి దుశ్చర్య కు పాల్పడింది అన్నారు.
విశాఖలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
RELATED ARTICLES