Thursday, August 7, 2025

మంగపేట ప్రజల గాధ… పట్టించుకునే నాథుడే లేడా?

గంగాధర, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామ ప్రజల బాధ ముందు నుయ్యి వెనుక గొయ్యిల అగమ్య గోచరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే గంగాధర మండలంలోని మంగపేట గ్రామ ప్రజలకు గత 20 ఏళ్ల నుండి ముంపు బాధితులుగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. దానితో పాటు అదే మండలంలోని నారాయణపూర్ చర్లపల్లి గ్రామస్తులు కూడా నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు గానే మిగిలిపోయారు. ఆనాడు 1994 సంవత్సరంలో భారత దేశ ప్రధాని పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా. వరద కాలువలు తవ్వకాలు ప్రారంభించారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో మూడు గ్రామాలకు అనుసంధానమైనటువంటి నారాయణపూర్ చర్లపల్లి మంగపేట చెరువులు కలిసి ఉండటంతో రిజర్వాయర్ గా మార్చాలని ఉద్దేశంతో 1999లో శంకుస్థాపన చేసి త్రాగునీటి అవసర నిమిత్తం ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది.

నారాయణపూర్ రిజర్వాయర్ చేపట్టడం వల్ల కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం ఆరు మండలాలతో పాటు వేములవాడ కొడిమ్యాల పూడూరు నల్గొండ సూరారం ఇతరత్రా మండలాలకు త్రాగునీటితోపాటు వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో రిజర్వాయర్ చేయాలని శిలాఫలకం వేసి ప్రారంభం చేపట్టారు. ఆనాటి కాలంలో వ్యవసాయ రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నారాయణపూర్ రిజర్వాయర్ చేయాలని రామడుగు మండల కేంద్రంలో 15 రోజుల్లో రిలే నిరాహార దీక్ష చేపట్టి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. కాగా పాలక యంత్రాంగం ప్రభుత్వాలు మారడం వీటన్నిటికీ తోడుగా రైతులకు ఎనలేని కష్టాలు ఎదుర్కోవడం సాగునీరు పంట పొలాలకు అందకపోగా ఎంతో మంది రైతులు అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉండేది. ఇదంతా ఒకవైపు ఉంటే నారాయణపూర్ రిజర్వాయర్ చేపట్టడం వల్ల రిజర్వాయర్కు ఆనుకొని ఉన్నటువంటి మంగపేట చర్లపల్లి నారాయణపూర్ గ్రామాల ఇండ్లు రిజర్వాయర్లో ముంపుకు గురవుతూ కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.

అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఆ ముంపు బాధితులు తమకు పునర్నివాసం కల్పించాలంటూ ప్రతి ఏర్పడ్డ ప్రభుత్వానికి వినతి పత్రాలు తమ గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా వారి గోడును పట్టించుకోకపోవడం కోస మెరుపు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నారాయణపూర్ చెరువును నింపడం వల్ల మంగపేట గ్రామస్తుల ఇండ్లు పూర్తిగా మునిగిపోవడం దానికి తోడుగా చర్లపల్లి లోని కొన్ని ఇండ్లు అదేవిధంగా నారాయణపూర్ లోని మరికొన్ని ఇండ్లు శిధిలానికి చేరుకోగా తాము పూర్తి స్థాయిలో నష్టపోతున్నామంటూ మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పునర్నివాసం కల్పిస్తే మేము ఊరును వదిలిపెళ్తామంటూ ఎన్నోమార్లు విన్నవించుకున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం వారిపై దయ చూపని పరిస్థితి నెలకొంది. ఇట్టి నారాయణపూర్ చెరువు నింపుతే దానిద్వారా ఐదారు మండలాలు వ్యవసాయానికి సాగునీరు అందే పరిస్థితి ఉండడం లేదంటే ఈ ఐదారు మండలాల వ్యవసాయ రైతులు పూర్తిగా పంటలు ఎండి నష్టపోయే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది.అయితే ఇతర మండలాల ప్రజలు నారాయణపూర్ ద్వారా సాగునీరు అందించాలని పోరాటం చేస్తుంటే మరోవైపు ఈ మూడు గ్రామాల ముంపు బాధితులు మాత్రం మాకు పునరావాసం కల్పించిన పిమట నీటిని వదలాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్న సందర్భాలు ఎన్నో.. ఇకపోతే నారాయణపూర్ చెరువు నింపడం వల్ల మంగపేట గ్రామ ప్రజలు ఇండ్లలో ఉండలేని పరిస్థితి విష సర్పాలతో పాటు ముసల్లు ఇతర క్రిమి కీటకాలు అన్ని ఇళ్లలో చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా జీవనం గడిపే పరిస్థితి.

మంగపేట గ్రామ ప్రజలకు ఒకవైపు రిజర్వాయర్ చెరువుల ద్వారా ముప్పు ఏర్పడితే మరోవైపు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా రైల్వే లైన్ ఏర్పడడంతో ఆ గ్రామానికి దారి లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఆనాటి నుండి నేటి వరకు గత 20 సంవత్సరాల క్రితం లో చూసిన ఆర్టీసీ బస్సును నేటి వరకు ఆ గ్రామానికి పోవడం కాదు కదా ఆటో కూడా చేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామంలో తప్పిదారిపోయి గర్భిణీ స్త్రీలు ఉంటే మాత్రం వారికి దేవుడే రక్ష అన్న విధంగా పరిస్థితి దాపురించింది. ఇంత జరుగుతున్న ప్రభుత్వాలు మారుతున్న ఆ గ్రామ ప్రజలను తొంగిచూసిన నాధుడే లేడు. గత 20 ఏళ్ల నుండి మంగపేట గ్రామస్తులు ప్రభుత్వంతో పోరాటం చేస్తుంటే మొన్న 15 రోజుల క్రితం ముంపు బాధితులకు వ్యవసాయ భూముల పైసలను నష్ట పరిహారం కింద ఇవ్వడం జరిగింది. కానీ ఆ చెరువులో ఉన్నటువంటి గ్రామాల ఇండ్లను అర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందిస్తే వారు మరోచోట పునరావాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కానీ ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు వారిపై దయ చూపక పోగా ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని జీవిస్తున్నారు.

గత 20 ఏళ్ల పోరాటంలో తమకు ఏ ప్రభుత్వం కూడా ఆసరాగా నిలిచిన దాఖలాలు లేవంటూ మంగపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ ను పూర్తిగా నింపడం కిందిస్థాయి మండల ఆయకట్టులకు మీరు అందించడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మా పరిస్థితిని పట్టించుకోని మాకు పునరావాస కల్పిస్తే బాగుండునని నేటి ప్రభుత్వాన్ని మంగపేట ప్రజలు వేడుకుంటున్నారు. చొప్పదండి నియోజకవర్గం లోని 6 మండలాలకు ఈ నారాయణపూర్ చెరువులను నింపడం వల్ల వ్యవసాయ రైతులకు ఊరట ఉంటుందనేది ఎంత నిజమో కానీ అదే చెరువులోని ముప్పు బాధితులకు ముప్పు ఉంది అనేది అధికార యంత్రాంగం గమనిస్తే బాగుంటుందని వేడుకుంటున్నారు. . ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ చెరువులను నింపినప్పుడల్లా అటు మంగపేట గ్రామస్తులు ఇటు చర్లపల్లి. నారాయణపూర్ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. చెరువును నింపడం వల్ల ఎప్పుడు కట్ట తెగిపోతుందా అనే అయాందోళనకు గురికావడం గత వర్షాకాలంలో అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో చెరువుకు గండిపడగా నీరంతా ఊర్లలోకి వెళ్లడం రామడుగు మండలంలోని వాగు పెద్ద ఎత్తున పొంగిపొర్లడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ నారాయణపూర్ చెరువు ద్వారా ఆయకట్టు రైతులకు నీరు వదులుతే కొంతవరకు మేలు జరుగుతున్నప్పటికీ ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో ఆటంకం ఎదురవుతుందని వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా పునరావాసం కల్పిస్తే బాగుంటుందని ఆ గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular