Monday, August 4, 2025

గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న అధికార పార్టీ

జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి

తిరుపతి ట్రాఫిక్ స్తంభించెలా రాస్తారోకో యువత

తిరుపతి మార్చి 14(నిఘా న్యూస్): గ్రూప్ -1 పోస్టుల ను అమ్మేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి.దీనిపై సిబిఐతో విచారణ చేపట్టాలనీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు డిమాండ్ చేస్తూ తిరుపతి రోడ్లు ట్రాఫిక్ స్తంభించేలా రాస్తారోకోలు చేశారు . స్థానిక భవాని నగర్ సర్కిల్ వద్ద రాస్తారోకోలో నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ… ఇసుకలో దోచుకున్నావు, మద్యం లో దోచుకున్నావ్, మైన్స్ లో దోచుకున్నావు, భూమిని దోచుకున్నావు, పేదవాడిని ముక్కు పిండి వసూలు చేసావ్. చివరకు నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా గ్రూప్-1 పోస్టుల్లో కూడా దోచుకోవడం ఇంత దారుణమా అంటూ వాపోయారు..ఏపీపీఎస్సి కమిషన్ కాస్త వైఎస్ఆర్సిపి కలెక్షన్ కమిషన్ గా మారిందనీ గౌతమ్ సవాంగ్, సీతరామాంజనేయులపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలనీ డిమాండ్ చేశారు.నిరుద్యోగుల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు

2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం 162 గ్రూప్ వన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది..అప్పటి నోటిఫికేషన్ లో మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి డిజిటల్ మూల్యాంకనం చేయడంతో హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని మందలించడంతో మ్యాన్యువల్ గా మూల్యాంకనం చేస్తామని హామీ ఇచ్చి దగా చేశారన్నారు. అయితే మూల్యాంకనంలో వారికి కావాల్సిన వారు అర్హత సాధించకపోవడంతో రెండుసార్లు మూల్యాంకనం చేపట్టారు దీనిపై కోర్టు నిన్న నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది… ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు వెంటనే జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేసినందుకు దగా చేసినందుకు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హత లేదన్నారు .పేదవాడు చదువుకున్నవాడు ఆర్డిఓ. ,డిప్యూటీ కలెక్టర్లు అవ్వకూడదా డీఎస్పీలు అవ్వకూడదా..పేదవాడు బడుగు బలహీన వర్గాలు వీటికి అర్హులు కాదా జగన్ రెడ్డి అంటూ రవి నాయుడు ప్రశ్నించాడు.. నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు ఈముఖ్యమంత్రి జగన్ ని వదిలిపెట్టమని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.. ఎన్నికల్లో నిరుద్యోగులే జగన్ కు బుద్ధి చెబుతారు ఆయన హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు హేమంత్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు, అధికార ప్రతినిధి తోటవాసు, నియోజకవర్గ అధ్యక్షులు కరణం సందీప్, పత్తిపాటి వివేక్, శ్రీనివాస్ యాదవ్, శ్రీరామ్ బాబి, కోబాక లక్ష్మణ్, గోపి ,దిలీప్ రాయల్ ,లోకేష్ రాయల్, సాయి, శివ, నాగరాజు, వెంకట్ రెడ్డి, గుణ మరియు యువత విద్యార్థులు పెద్ద స్థాయిలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular