బీసీ కులాల ఐక్యతతో సాధిద్దాం
బీసీ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం
తిరుపతి మార్చి14(నిఘా న్యూస్):సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ లందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలని బీసీ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం పిలుపునిచ్చారు.గురువారం బీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీల యొక్క ముఖ్య ఉద్దేశం సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమని కాబట్టి తిరుపతిలో ఉన్న బీసీ కులోల యొక్క ముఖ్య ఉద్దేశం జై బీసీ జై జై బీసీ బీసీ ఐక్యత వర్ధిల్లాలని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని బీసీ లందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సూపర్ సెక్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ కులాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.