హుజూరాబాద్, నిఘా న్యూస్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, ఆశీష్ గౌడ్ లో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.